వేగం పెంచండి పలు ప్రాజెక్టులకు భూసేకరణపై జాయింట్ కలెక్టర్ దిశా నిర్దేశం.



 వేగం పెంచండి పలు ప్రాజెక్టులకు భూసేకరణపై జాయింట్ కలెక్టర్ దిశా నిర్దేశం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండోసోల్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ అంశాలపై జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనాకుమారి సమీక్షించారు. కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమ వంశీతో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం ప్రకాశం భవనములోని తన చాంబర్లో ఆమె చర్చించారు. భూ సేకరణలో పురోగతి, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. వీటిని సత్వరం పూర్తిచేసేలా చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు నాగిరెడ్డి, నాసరయ్య, ఇండోసోల్ కంపెనీ ప్రతినిధులు ఐ.వి.రెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, పోర్టు, మ్యారీటైం బోర్డు అధికారులు, సంబంధిత మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post