ఆహర భధ్రత అధికారి పేరుతో అక్రమ వసూళ్ళు.


 ఆహర భధ్రత అధికారి పేరుతో అక్రమ వసూళ్ళు.

లైసన్స్ లేకపొతే భారి జరిమాన .

లంచం ఇవ్వకపొతే‌ తనిఖిలు చేపిస్తాం. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

నష్టపొయిన రెస్టారెంట్ నిర్వహకుడు పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

మార్కాపురంజిల్లా పొదిలి పట్టణంలోని ఒక రెస్టారెంట్ నిర్వహకుడి గుర్తు తెలియని వ్యక్తి ఫొన్ చేసి మీ రెస్టారెంట్ కు లైసన్స్ లేదని ప్రస్తుతం మీ ప్రాంతంలో తనిఖిలు నిర్వహిస్తున్నామని ఇంక కొద్దిసేపట్లో మీ రెస్టారెంట్ తనిఖి నిర్వహింబొతున్నామని సమాచారం ఇచ్చి రెస్టారెంట్ తనిఖి చేయకుండా ఉండాలంటే అత్యవసరంగా 60 వేలు ఫొన్ పే కొట్టాలని బెదిరించాడు.

దింతో భయానికి గురైన భాదితుడు తన వద్ద అంత డబ్బులేదని ఆరువేల రూపాయలు ఫొన్ పే చేశాడు.

ఆకస్మికంగా రెస్టారెంట్ తనిఖి కి వచ్చిన పుడ్‌సెప్టి అధికారికి విషయం తెలియజేయడంతో బాధితున్ని తీసుకెళ్ళి స్వయంగా పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పుడ్ సేప్టి అధికారులు ఎప్పుడు డబ్బులు అడగరని నియమనిబంధనల ప్రకారం చలాన కట్టి లైసన్స్ తీసుకొవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

పుడ్ సేప్టి అధికారి పేరుతో ఎవ్వరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అలాంటి అక్రమ వసూళ్ళకు పాల్పడే సమాచారం అందించాలని ఆయన కొరారు.

_మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్న 08592233213 ఈ నెంబర్ కాల్ చేయమని తెలిపారు.

రెస్టారెంట్ నిర్వహకుడికి 6301919798 నుండి కాల్ చేసి 9493893913 ఫొన్ పే చెపించుకున్నారని తెలిపారు._

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post