గిద్దలూరులో 1.1 కోట్ల సి.సి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల,


  గిద్దలూరులో 1.1 కోట్ల సి.సి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల, 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఒక కోటి ఒక లక్ష రూపాయల వ్యయంతో నూతన సి.సి రోడ్ల నిర్మాణానికి శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణ లోని రాచర్ల రోడ్ లోని టీచర్స్ కాలనీ, నల్లబండ బజార్, అర్బన్ కాలనీ, శ్రీరామ్ నగర్ వార్డులలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు నూతన సి .సి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు.

అభివృద్ధి పనులు నాణ్యతతో మరియు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గిద్దలూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

స్థానిక మహిళలు తమ అభిప్రాయాన్ని తెలుపుతూ ఎన్నో సంవత్సరాల నుంచి సరి అయిన రోడ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాము అని నేడు మీరు ఇచ్చిన మాట ప్రకారం కొత్త రోడ్లు మంజూరు చేసినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం అని కృతజ్ఞతలు తెలిపారు అనంతరం శాసనసభ్యులకు శాలువ, పూల మాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్,పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ లు వార్డు నాయకులు, ఇంచార్జ్ లు, మహిళలు,అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post