ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు
ప్రకాశం జిల్లా మద్దిపాడు రైతు సభలో మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెంచేలాచర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్, డోలా, బాలవీరాంజనేయ స్వామి చెప్పారు.
శుక్రవారం మద్దిపాడులో నిర్వహించిన 2025 - 26 సంవత్సర జిల్లాస్థాయి ' అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ ' మూడవ విడత నిధుల జమ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు.
ముందుగా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు .బి.ఎన్.విజయకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ జయంతి బాబు, ఒంగోలు ఆర్డిఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపీచంద్, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, స్థానిక ఏఎంసి చైర్ పర్సన్ రాజేశ్వరి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలోని రైతులకు ఈ ఏడాది మూడు విడతలలో కలిపి రూ.471.34 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. ఈనాము భూ సమస్యలను పరిష్కరిస్తామని, విత్తనాలు, ఎరువులు, పంట ఉత్పత్తుల కొనుగోలు వంటి అన్ని విషయాలలో రైతులకు అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో వంటగ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంలో మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ' రైతన్నా మీకోసం ' కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ప్రారంభిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సాగులో వినియోగించడంపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. భూ సమస్యలను మండల స్థాయిలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
సంతనూతలపాడు శాసనసభ్యులు బి. విజయ్ కుమార్ మాట్లాడుతూ భారీ సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి రైతులకు ప్రభుత్వంఅండగానిలుస్తున్నట్లుచెప్పారు.
సంతనూతలపాడునియోజకవర్గంలో ఈ పథకం కింద ఈ ఏడాది మూడు విడతల్లో కలిపి 27,036 మంది లబ్ధిదారులకు రూ.53.67 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు.
ఈ మేరకు రైతులకు ఈ కార్యక్రమంలో బ్యాంకు చెక్కును అందించారు. అనంతరం సంతనూతలపాడు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కూడా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ బాబు, ఎంపీడీవో జ్యోతి, తహసిల్దార్ ఆదిలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
