గిద్దలూరులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.


  గిద్దలూరులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక అన్న క్యాంటీన్ వద్ద రేపు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బెల్లంకొండ సాయి బాబా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ స్థాపకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. 

కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రేపు జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని బెల్లంకొండ సాయి బాబా పిలుపునిచ్చారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post