ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి జాయింట్ కలెక్టర్.


 ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి జాయింట్ కలెక్టర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం, జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్క రించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సూక్ష్మ స్థాయిలోపరిశీలించి సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 

ప్రజల నుండి ఎక్కువ శాతం రెవెన్యూ మరియు భూములకు సంబంధించిన సమస్యలపై అర్జీలు వస్తున్నాయని ఆయన అన్నారు. 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో న్యాయం కోసం వచ్చిన అర్జీ దారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగాఉంటే వెంటనే చేయాలని ఆయన చెప్పారు. 

సమస్యలుపరిష్కరించలేనివాటిగురించి రాతపూర్వ కంగా ఎండార్స్ మెంట్ ఇవ్వాలని ఆయన చెప్పారు. 

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 170 అర్జీలు వివిధ సమస్యలపై వచ్చాయని ఆయన అన్నారు. 

వీటిలో రెవె న్యూశాఖకు సంబం ధించినవి 116 అర్జీలు ఇతర శాఖలకు సంబంధించి 54 అర్జీలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్ కంభం ఎస్.డి.సి శివరామిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాలాజి నాయక్, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జెన్నమ్మ, డివిజనల్ పంచాయ తీ అధికారి బాలు నాయక్, మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post