అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.



 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోనీ చీతిరాల కళ్యాణ మండపంలోనిర్వహించిన అంతర్జాతీయ మహిళాదినోత్సవం కార్యక్రమంలో గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు..

ఈ సందర్భంగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ముఖ్యమైన శక్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. విద్య, ఉపాధి, వ్యాపారం, రాజకీయాలు వంటి అన్ని రంగాలలో మహిళలు ముందుకు రావడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. మన దేశంలో వివాహ బంధానికి ఉన్న విలువ ప్రపంచం లో ఎక్కడ లేదు అని అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కడ ఒక్క మహిళ అధ్యక్షులు గా లేరు ఒక్క మన భారత దేశంలో తప్ప ఒకప్పుడు మహిళ అంటే వంట ఇంటికే పరిమితం అన్నారు కానీ నేడు అలా లేదు మన రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమానత్వాన్ని ఇచ్చారని, 1983 వ సంవత్సరం లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని ఆదిలోనే కాదు సమాజంలో అన్ని రంగాల్లో ముందు ఉండాలని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళా సభ్యురాలు అభివృద్ధి కి ఈ సంపాదన కుటుంబం లో వారికి ప్రత్యేక గుర్తింపు గౌరవం కలిగించిందని మన ముఖ్య మంత్రి, మన చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు, గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు మహిళల సాధికారతకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు.

అనంతరం నియోజకవర్గం స్థాయిలో పేరు గౌరవం తెచ్చిన మహిళలలు అయిన రచనలో, కవితలో జాతీయ స్థాయిలో పేరు గౌరవం తెచ్చిన రైల్వే ఉద్యోగి షేక్ . షకీలా, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ బోనేని రవణమ్మ, మార్క్ అసెంబ్లీలో మాట్లాడిన నక్కా రమ్యా, అవయవ లోపం ఉన్నత స్థాయి కి ఎదగడానికి అడ్డుకాదు అని నిరూపించి తన రెండు కళ్లు కనిపించకపోయినా గ్రేడ్ -2 లో ఉద్యోగం సాధించి నేడుఅర్ధవీడు H.M & MEO గా విధులు నిర్వహిస్తున్న సుజాత గారిని ఎమ్మెల్యే ప్రత్యేకం గా శాలువా పూల మాలతో ఘనంగా సన్మానించారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post