కంభం మల్లికార్జున హాస్పిటల్ లో డి ఎం హెచ్ ఓ తనిఖీలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు వైద్యశాలలు అనే కధనం పై స్పందించిన జిల్లా వైద్యాధికారి.
కంభం మల్లికార్జున హాస్పిటల్ లో కాలం చెల్లిన మందులు అమ్మకం పై స్పందించిన భాదితుడి ఫిర్యాదు తో తనిఖీలు చేసిన అధికారులు.
కంభం:: ప్రైవేట్ వైద్యశాలలో లో ఖరీదైన వైద్యం అయినా కానీ ప్రజలు మెరుగైన వైద్య సేవలంటాయానీ పరుగులు తీస్తుంటారు.
అయితే కొన్ని వైద్యశాలలు ఇదే అదునుగా దోపిడీ చేయడమే కాక కాలం చెల్లిన మందులు అమ్మకం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు.
ఇది మార్కాపురం జిల్లా కంభం లో చోటు చేసుకున్న ఘటన.
కంభం మండలం లోని మల్లికార్జున సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ లో కాలం చెల్లిన మందులు అమ్మకం చేశారు. వివరాల్లోకి వెళితే కంభం అర్బన్ కాలనీ కి చెందిన షేక్ ఫరీద్ తన 18 నెలల పాప జోహ కు జ్వరం రావడంతో పట్టణంలోని మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ కు 6వ తేదీ తీసుకొని వెళ్ళాడు.అక్కడ వైద్య పరీక్షలు చేసి చికిత్స అనంతరం పాప బలహీనముగా ఉందని హాస్పిటల్ లోని మందుల షాపు లో సిరప్ కొన్నారు.అక్కడి నుండి ఇంటికి వచ్చి 9వ తేదీ సిరపు చిన్నారి తాపించడంతో వాంతులు, విరోచనాలు అయ్యాయి.తల్లిదండ్రులు సిరపును పరిశీలించగా అప్పటికే కాలం చెల్లి పోయిందని గమనించారు వెంటనే హుటా హుటిన మల్లికార్జున మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ తీసుకొని వెళ్లగా మరల ట్రీట్మెంట్ చేసి రక్త పరీక్షలు చేయించమన్నారు.పాప తల్లిదండ్రులు సిరప్ వికటించడంతోనే పాప తల్లడిల్లి పోతుందని వైద్యులను తల్లిదండ్రులు ప్రశ్నించగా డాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి,అక్కడ వైద్య పరీక్షలు చేయించారు.వైద్యులు కాలం చెల్లిన సిరపు తాపించడం వలన ఇలా జరిగి ఉండవచ్చనీ అని దానివలన చిన్నారికి వాంతులు విరోచనాలు అయితున్నాయని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ఇలాంటి ప్రైవేటు వైద్యశాలల మీద చర్యలు తీసుకోవాలని పిజి ఆర్ ఎస్ లో ఫిర్యాదు చేసి, అనంతరం జిల్లా వైద్యశాఖాధికారికి ఫిర్యాదు చేశారు.
ఆసుపత్రి లో తనీఖీ చేపట్టిన జిల్లా వైద్య అధికారి.
కాలం చెల్లిన ఔషదం అమ్మకం పై సామాజిక మాధ్యమాల లో, న్యూస్ ఛానెల్ లో వచ్చిన వార్తకు, బాదితుడి ఫిర్యాదు కు స్పందించిన జిల్లా వైద్యశాఖాధికారి శ్రీ వాణి ఆదేశాల మేరకు 13 మార్చిన తుడిమిళ్ళ మెడికల్ ఆఫీసర్ వారి బృందంతో మల్లికార్జున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో తనిఖీలు చేపట్టారు. తిరిగి మరల నేడు అనగా మంగళవారం 25-03-2026 న హాస్పిటల్ లోని తనిఖీలు చేపట్టారు.
