ఏలూరు బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య.



 ఏలూరు బి ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య.

క్రైమ్ఏ 9మీడియా ఏలూరు ప్రతినిధిశరత్.

మార్చ్ 26. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో సి ఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాలలో బి ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న చిలుకూరి సువర్షిణి బుధవారం అర్ధరాత్రి సుమారు 11:30 సమయంలో హాస్టల్ భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది అని గమనించిన హాస్టల్ వార్డెన్ మరియు తోటి విద్యార్థులు ఆమెను ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. సువర్షిణి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకువెళ్ళమన్న ఏలూరు ప్రభుత్వ సిబ్బంది. విజయవాడ తీసుకెళ్లే మార్గమధ్యంలోనే మరల సీరియస్ అయిందని మళ్లీ వెనుకకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం సువర్షిణి మరణించడం జరిగింది. సువర్షిణి మరణం వెనక తమకు అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. స్థానిక ఏలూరు మూడవ పట్టణం పోలీస్ లు సంఘటన స్థలాన్ని క్లూస్ టీం తో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post