జనగణ ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలి డిఆర్ఓ.
ప్రకాశం జిల్లాలో జనగణన-2027 కు సంబంధించి నిబంధనలను, పద్ధతులను పూర్తిగా అవగాహన చేసుకొని జిల్లాలో జనగణన ప్రక్రియ పటిష్టంగా చేపట్టేలా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఫీల్డ్ ట్రైనర్స్ ను ఆదేశించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హల్లో సోమవారం జిల్లాలో జనగణన ప్రక్రియ పై ఫీల్డ్ ట్రైనర్స్ కు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ, జిల్లాలో జనగణన ప్రక్రియ కు సంబంధించి రెండు విడతల్లో 65 మంది ఫీల్డ్ ట్రైనర్స్ కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ నెల 23,24,25 మూడు రోజుల పాటు మొదటి విడతలో, ఈ నెల 26,28,29 తేదీల్లో మూడు రోజుల పాటు రెండో విడతలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ శిక్షణ అనంతరం వీరు క్షేత్ర స్థాయిలో పనిచేసే ఎన్యూమరే టర్లకు , సూపర్వైజర్ల కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ శిక్షణా తరగతుల్లో సంబంధిత అధికారులు, ఫీల్డ్ ట్రైనర్స్ పాల్గొన్నారు.
