నేషనల్ డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ సమావేశం లో పాల్గొన్న కలెక్టర్ పి రాజాబాబు.


 నేషనల్ డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ సమావేశం లో పాల్గొన్న కలెక్టర్ పి రాజాబాబు.

ఒంగోలు డిఎంఎఫ్ నిధులను సమర్ధవంతంగా వినియోగించాలన్న అంశం పై న్యూ ఢిల్లీ లోని స్కోప్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుచున్న నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ సమిట్ -2026 కు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొన్నారు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఈ వర్క్ షాప్ ను కేంద్ర గనుల శాఖ మంత్రి, కిషన్ రెడ్డి, ప్రారంభించగా, కేంద్ర గనుల శాఖ కార్యదర్శి,పీయూష్ గోయల్,కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, డిఎంఎఫ్ నిధులను సంబంధిత గనుల నుండి 25 కిలో మీటర్ల పరిధి లోపు ఖర్చు చేయాలన్న నిబంధనలో ఎటువంటి రాజీ లేదని, ఈ అంశం పై గౌరవ ప్రధాని మంత్రి కూడా దీనిపై ఎటువంటి రాజీ అవసరం లేదని తెలిపారన్నారు.

 ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ, జిల్లాలో పర్యావరణ అభివృద్ధి కొరకు డిఎంఎఫ్ నిధులతో రెండు చోట్ల డిఎంఎఫ్ వనాలకు మియావకీ విధానంలో 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. చీమకుర్తి దగ్గర ఒంగోలు - పొదిలి రోడ్డు డైవర్షన్ కొరకు డిఎంఎఫ్ నిధులతో పాటు, ఇతర నిధుల ఆవశ్యకత అవసరమని వివరించారు.

ఈ వర్క్ షాప్ లో దేశంలోని 100 జిల్లాల కలెక్టర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గనుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ వెంట జిల్లా గనుల శాఖ ఉప సంచాలకులు శ్రీ రాజశేఖర్ పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post