బాల్య వివాహాలను అరికట్టాలి - ఐ సి డి ఎస్ సూపర్వైజర్ కమల కుమారి.


 బాల్య వివాహాలను అరికట్టాలి - ఐ సి డి ఎస్ సూపర్వైజర్ కమల కుమారి.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా దర్శి మండల కేంద్రంలోని శివరాజ్ నగర్ లోని ఐదవ సచివాలయం పరిధిలో అంగన్వాడీ కార్యకర్త పుప్పాల బాలమ్మ, అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి దర్శి ఐసిడిఎస్ ప్రాజెక్టు సెక్టార్ సూపర్వైజర్ కమల కుమారి, 

ముఖ్యఅతిథిగాపాల్గొనిమాట్లాడాతూ. బాల్య వివాహాల వల్ల ఆడబిడ్డలకు పలు సమస్యలు ఎదురవుతాయని. వయస్సు పెరగకుండానే పెళ్లి చేయడం వల్ల వివాహమనే బంధానికి అర్థం తెలియక బాల్య వివాహాలు చేసుకున్న పిల్లలు త్వరగా ఆ బంధాన్ని పెంచుకునే పరిస్థితి మనము చూస్తున్నాము. అందువలన బాలికలకు 18 సంవత్సరాలు నిండిన వయసు గలవారై బాలురు 21 సంవత్సరము వయసు నిండిన వారైతే నే ప్రభుత్వా నిబంధన ప్రకారంగా చేసుకోవాలని ఆమె తెలిపారు. 

ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బాల్య వివాహాలు చేసుకున్న. చేయించిన వారైనా ప్రోత్సాహవిస్తున్న వారికైనా పలు శిక్షలు పడతాయని చట్టాల గురించి శిక్షలు గురించి ఆమె తెలిపారు. 

అందువల్ల బాల్య వివాహాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఆమె గ్రామస్తులకు పిలుపునిచ్చారు. 

అలాగే సెక్టార్ పరిధిలోని శివరాజ్ నగర్ అంగన్వాడి సెంటర్ల పరిధిలో ఉన్నటువంటి బాలింత గర్భవతులకు తగు సూచనలు చేశారు వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎంత విశ్రాంతి తీసుకోవాలని విషయాలపై వారికి అవగాహన కల్పించారు. 

అనంతరము కొంతమంది గర్భవతులకు సీ మంతాలు చేయించారు. 

ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ ఏ ఎన్ ఎం లు బి ప్రశాంతి. పద్మ. అంగన్ వాడి కార్యకర్తలు పుప్పాల బాలమ్మ. పార్వతి. శిరీష ఆశ కార్యకర్తలు గాయత్రి. ఉషారాణి మరియు పలువురు గర్భిణీ .బాలింత స్త్రీలు. పలువురు మహిళలు. కిషోర్ బాలికలు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post