గంజాయి అక్రమ రవాణాదారులపై అనకాపల్లి జిల్లా పోలీసుల ఉక్కుపాదం.


 గంజాయి అక్రమ రవాణాదారులపై అనకాపల్లి జిల్లా పోలీసుల ఉక్కుపాదం.

ఇద్దరు నిందితులపై 'పిట్ ఎన్.డి.పి.ఎస్' (PIT NDPS) చట్టం ప్రయోగం.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి(చీడికాడ)మార్చి:16 జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, జిల్లాలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా, వరుస నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులపై PIT NDPS Act (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act) కింద ఉత్తర్వులు జారీ చేసి, వారిని రిమాండ్‌కు తరలించారు.

నిందితుల విస్సరపు లింగేశ్వరా.గుమ్మడి నిరంజన్. బైలపూడి గ్రామం, చీడికాడ మండలం. వీళ్ళపై గతంలో స్టేషన్లలో వేర్వేరు గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. నిత్యం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వీళ్ళపై పై ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వుల (G.O.RT. No.20) మేరకు చర్యలు తీసుకొని.

కె.కోటపాడు ఇన్స్పెక్టర్ కె.కృష్ణ మరియు చీడికాడ ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, పటిష్ట భద్రత నడుమ విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.పోలీసుల హెచ్చరిక 

​జిల్లాలో గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా లేదా విక్రయించినా సహించేది లేదని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. అలవాటు పడిన నేరస్తులపై కేవలం సాధారణ సెక్షన్లే కాకుండా, ఇలాంటి కఠినమైన చట్టాలను ప్రయోగిస్తామని, వారి ఆస్తుల జప్తుకు కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post