ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం మంత్రి డోలా.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి, డా,డోలా బాల వీరాంజనేయస్వామి సోమవారం నాడు తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశంలో నిర్వహించారు జిల్లాలో జరుగుతున్న ఆర్ డబ్ల్యూ ఎస్ పనులపై మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పెండింగ్ పనులను త్వరితగతిన గతిన పూర్తి చేయాలి.
పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధి సూచికను మెరుగుపరచాలని మంత్రి డోలా,బాల వీరాంజనేయస్వామి అన్నారు.
