భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని ధర్శించుకున్న రెడ్డి అప్పలనాయుడు దంపతులు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రెడ్డి అప్పలనాయుడు దంపతులు.
భద్రాచలం, ఫిబ్రవరి 24:- తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలోని రెవెన్యూ గ్రామం జనగణన పట్టణం లో భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని మంగళవారం ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు వారి సతీమణి రెడ్డి అనురాధ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ గర్భాలయంలో వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సస్యశ్యామలంగా పాలించాలనే ఆశయంతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని సంకల్పంతోనూ ఈ పూజలు నిర్వహించామన్నారు. ఆ సీతారామస్వాముల వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి సౌభాగ్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు.

