సమవర్ధవంతంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమలుకు కృషి. జిల్లా నోడల్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్.


సమవర్ధవంతంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అమలుకు కృషి. జిల్లా నోడల్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్.

* పీజీఆర్ఎస్ సిబ్బందికి ప్రాధమిక శిక్షణ తరగతులు.

* ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవాలాందించాలని సూచన.

రంపచోడవరం : ఏజెన్సీ ప్రాంతం పోలవరం జిల్లాలో గిరిజనులకు సంతృప్తికర స్థాయిలో సేవాలందించడానికి రంపచోడవరం కేంద్రంగా జిల్లా పీజీఆర్ఎస్ సెల్ ఏర్పాటు చేసామని ద్వామా ఏపీడీ & జిల్లా నోడల్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలందరు ఉపయోగించుకువాలని అన్నారు. పీజీఆర్ఎస్ వేదికకు ఇచ్చే ప్రతి ఫిర్యాదు ఆన్లైన్ చేసి, ఫిర్యాదు దారుడికి రసీదు ఇచ్చి అదేరోజు సంబంధిత శాఖా అధికారులకు గడువులోపు సమస్యను పరిష్కరించమని ఫిర్యాదు ధరఖాస్తు పంపడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం అవుతున్నాయా లేదా అని, మరి ముఖ్యంగా ప్రజలు ఆశించే స్థాయిలో పరిష్కారం అవుతున్నాయా లేదా అని పిజీఆర్ఎస్ సెల్ నిరంతరం సమీక్షిస్తుందని అలాగే ప్రజలకు సహకారంగా సిబ్బంది సేవలు అందిస్తారని శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. పిఎంఆర్సిలో ఏర్పాటు చేసిన సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో పీజీఆర్ఎస్ సమర్ధవంతంగా అమలు చేయడానికి శ్రీనివాస విశ్వనాధ్ పలు సూచనలు చేసారు. సమీక్షలో డిప్యూటీ తాసిల్దార్ & సహాయ నోడల్ అధికారి సరిత, వీరన్న, సిబ్బంది తదితరులు ఉన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post