ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ పంపిణీ చేసిన ముత్తుముల్ల.



 ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ పంపిణీ చేసిన ముత్తుముల్ల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని కంభం పంచాయతీ అర్బన్ కాలనీలో ఈరోజు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల్ల అశోక్ రెడ్డి కి అధికారులు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అవ్వ తాతలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛను శాసనసభ్యులు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో అవ్వ తాతలతో శాసనసభ్యులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆదివారం సెలవు దినముగా ఉన్నది కనుక ఒకరోజు ముందుగానే వృద్ధులకు పింఛన్ ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు స్వయంగా నేను వచ్చి ఇస్తున్నానని చెప్పారు. 

అలాగే గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇస్తానని నాలుగు సంవత్సరాలకు మూడు వేల రూపాయలు ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసి ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మనదే అని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వి కిరణ్ కుమార్. ఎంపీడీవో వీరభద్రా చారి. పంచాయతీ అధికారులు. రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గోన చెన్నకేశవులు. టిడిపి నాయకులు మాధవ్. ఎన్టీఆర్ గౌస్. జనసేన నాయకులు. తాటి శెట్టి ప్రసాద్. బిజెపి నాయకులు. బాదం కిషోర్. కూటమి కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post