ముఖ్యమంత్రి రాక. పటిష్ట బందోబస్తు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం, గంటావానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విచ్చేయనున్న నేపథ్యంలో చేపట్టవలసిన ముందస్తు ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్, పి రాజాబాబు, ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్.పెందుర్తి వెంకటేష్, కనిగిరి, గిద్దలూరు శాసన సభ్యులు డా,, ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి,ముత్తుముల అశోక్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్.హిమ వంశి, యర్రగొండపాలెం నియోజక వర్గ టిడిపి ఇంఛార్జి.ఎరిక్షన్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నరు


