చోడవరం ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రలలో పటిష్ట పోలీస్ బందోబస్తు- సీఐ అప్పలరాజు.

చోడవరం ఇంటర్మీడియట్ పరీక్షల కేంద్రలలో పటిష్ట పోలీస్ బందోబస్తు- సీఐ అప్పలరాజు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, ఫిబ్రవరి :23

నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్షలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,ఆదేశాలు మేరకు

చోడవరం ఇంటర్మీడియట్ పరీక్షలు కేంద్రాలలో సీఐ అప్పలరాజు ఆధ్వర్యంలో ఎస్సై నాగకార్తీక్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది తో బందోబస్తు ఏర్పాటు చేయడమైనది.

​ప్రతి కేంద్రం వద్ద మహిళా అభ్యర్థుల తనిఖీ (Frisking) కోసం కచ్చితంగా ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్/హెడ్ కానిస్టేబుల్‌ను నియమించడమైనదని అలాగే

​పరీక్షా కేంద్రాల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత మండల మెజిస్ట్రేట్ల ద్వారా 144 సెక్షన్ అమలు చేశామని తెలిపారు.

​పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జెరాక్స్ సెంటర్లను పరీక్షా సమయంలో మూసివేయాలని స్పష్టం చేశామని తెలిపారు.

​విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిబ్బందిని మోహరించారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని.

​విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినకుండా పరీక్షా కేంద్రాల సమీపంలో లౌడ్ స్పీకర్లు, డీజేలు, ఆర్కెస్ట్రాలు మరియు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వలేదని నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అప్పలరాజు తెలిపారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post