మద్యం మత్తులో స్కూల్ బస్సు డ్రైవర్.
నిర్లక్ష్యం వహిస్తున్న చలపతి స్కూల్ యాజమాన్యం కనీస జిపిఎస్ లేని స్కూల్ బస్సు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి ఫిబ్రవరి:25
మాడుగుల మద్యం మత్తులో స్కూల్ బస్సు నడిపిన ఒక డ్రైవర్ ఉదంతం ఇది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో ఎం.కోటపాడు గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం 5.30గంటల సమయంలో చోడవరానికి చెందిన చలపతి పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ డ్రైవర్ మద్యం మత్తు విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల తక్షణమే స్పందించి మాడుగుల పోలీస్స్టేషన్ కు తరలించి నిందుతులను విచారిస్తున్నారు.
