మండపేట లోభారీ వర్షం - విద్యుత్ సరఫరా కు అంతరాయం.


 మండపేట లోభారీ వర్షం - విద్యుత్ సరఫరా కు అంతరాయం.

ఈదురు గాలులు-నెల రాలిన మామిడి పూత.

పల్లపు ప్రాంతాలు జలమయం.

డా "బి.ఆర్. అంభేడ్కర్ కోనసీమ జిల్లా : మండపేట లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండపేట , ద్వారపూడి, రూరల్ మండలం గ్రామాల్లో ఈదురు గాలులు తో వర్షం పడింది. కేశవరం లో భారీ వర్షం కురిసింది. మండపేట లో వర్షం వలన డ్రైన్ లలో నీరు రోడ్ పై ప్రవహించింది. ద్వారపూడి లో డ్రైన్ లు మూసుకొని పోవడం తో రోడ్ మీద నీరు నిలిచిపోయింది. మండపేట లో పలు ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్ పై ప్రవహించింది. ఇక ఇప్పుడిప్పుడే మామిడి చెట్లు కు పూత పుస్తువుంది. ఈ గాలులకు పూత మొత్తం రాలిపోయింది. ఇది ఈ ఏడాది మామిడి దిగుబడి పై ప్రభావం చూపనుందని రైతులు చెబుతున్నారు. వర్షం గాలులు కారణంగా విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా పునద్ధరణకు విద్యుత్ సిబ్బంది కృషి చేశారు. పలు చోట్ల విద్యుత్ వైర్లు పై చెట్ల కొమ్మలు విరిగి పడటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post