మార్చి 4న భారీ ర్యాలీ. మంత్రులు సమక్షంలో సభ.
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రధాన లక్ష్యం.
చలో విజయవాడ పోస్టర్ను ఆవిష్కరించిన ఏలూరు జిల్లా కమిటీ.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్).
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరుజిల్లా... ఏలూరు ఫిబ్రవరి 27: రాష్ర్ట వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారానికే చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్( ఏపీడబ్ల్యూజేఎఫ్) ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జబీర్, హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు రాష్ట్ర సంఘ నాయకులు బాలశౌరి మాట్లాడుతూ చలో విజయవాడ కార్యక్రమానికి జర్నలిస్టులకు సంబంధించిన సుమారు 11 డిమాండ్ల సాధన కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రధానంగా జర్నలిస్టుల ఇంటి కల నెరవేరలేదని ప్రభుత్వాలు మారుతున్నా కనీసం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించడం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శు జబీర్, హరీష్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఎన్నికల ముందు ప్రభుత్వాలు హామీ ఇస్తున్న అవి నెరవేచ్చే సమయంలో జర్నలిస్టులు వైపు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ప్రమాధ భీమా పథకాన్ని పునరుద్దరించాలని , ఇతర రాష్ర్టాల్లో జర్నలిస్టులకు అమలు చేస్తున్న పెన్షన్ విధానం అమలు చేయాలని , మీడియా హక్కుల పరిరక్షణకు ప్రత్యేకంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు కార్పొరేట్ సంస్థల నుంచి ఉచితంగా విద్య, వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తామంతా కోరుతున్నామన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందజేస్తున్న తరుణంలో సమాజం కోసం పాటు పడుతున్న జర్నలిస్టులకు వారి కుటుంబాలకు కార్పొరేట్ సంస్థల నుంచి ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నారు. అలాగే సుమారు 11 డిమాండ్లతో ఇప్పటికే తాము దశల వారీగా ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులకు వినతిపత్రాలు అందజేశామన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో మరోసారి వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వంలో పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని మార్చి 4న చలో విజయవాడ
వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని తమ రాష్ర్ట కార్యవర్గం నిర్ణయించిందని వారు తెలిపారు. ఆరోజు ఉదయం విజయవాడలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న జర్నలిస్టుల సభకు అతిధులుగా రాష్ర్ట సమాచార,పౌరసంబందాల శాఖామంత్రి కొలుసు పార్ధసారధి, కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ లను ఆహ్వానించడం జరిగిందన్నారు. మంత్రులు హాజరుకానున్న ఈ సభలో జర్నలిస్టుల సమస్యలు వివరించి వాటి పరిష్కారాన్ని కోరుతామన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సోమశేఖర్, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు నారాయణ, సీనియర్ సంఘ నాయకులు మిల్టన్ ప్రతాప్ , సత్యనారాయణ, సతీష్ ,దెందులూరు నియోజకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు రిషి, వెంకట్రావు, ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు జయరాం, ప్రతాప్, దొరబాబు, మౌనిక, వెంకటేశ్వరరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

