తాడివారి పల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం- పట్టించుకోని అటవీ అధికారులు.


 తాడివారి పల్లి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం- పట్టించుకోని అటవీ అధికారులు.

భయం గుప్పెట్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.

పట్టించుకోని అటవీ శాఖ అధికారులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా, తాడివారి పల్లి చెక్ పోస్ట్, పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుంది. గత నాలుగు రోజుల నుంచి రహదారిపై చిరుత పులి వాహన దారుల కంట పడుతుందని, రోల్లగుంపాడు నుండి ఫారెస్ట్ చెక్ పోస్ట్ మధ్యలో, ఆశ్రమం దగ్గర చిరుత సంచారం ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 పట్టించుకోని అటవీశాఖ అధికారులు.

 తాడి వారి పల్లి పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో చిరుత సంచారం ఉందని ఆయా గ్రామాల ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన వారు పట్టించుకోవటం లేదని, ఆధారాలు చూపించాలని ఎదురు ప్రశ్నిలు వేస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దీంతో చిరుత ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు.

 ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించి, చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రాణాలను రక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post