మార్చి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఉత్తర్వులు.


 మార్చి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ఉత్తర్వులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మార్చి నెలకు సంబంధించి ఒకటవ తేది ఆదివారం కావడంతో, ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 28 శనివారం పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో మొత్తం 3,289 మంది లబ్ధిదారులకు రూ.1 కోటి 48 లక్షల 64 వేల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. 

పెన్షన్ల పంపిణీ కోసం 89 మంది సచివాలయ సిబ్బంది, నలుగురు సూపర్వైజర్లు నియమించబడి, శనివారం ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తారని వెల్లడించారు.

కావున లబ్ధిదారులు ఎవరూ సచివాలయాల వద్దకు రావాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దకే పెన్షన్ అందజేయబడుతుందని స్పష్టం చేశారు. అలాగే సచివాలయ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులను ఒకేచోటుకు పిలిచి పెన్షన్లు పంపిణీ చేయరాదని, ప్రతి లబ్ధిదారుడి ఇంటికే వెళ్లి అందజేయాలని పురపాలక సంఘ కమిషనర్ ఈ.వి. రమణబాబు ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post