ఉపాద్యాయుల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఉపాద్యాయుల మమకారం ఉపకారమై ఆ పాఠశాల విద్యార్థులను అల్పాహారంగా ఆదుకుంటోంది. మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు,100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అదనపు తరగతులతో ఎదుర్కుంటున్న ఒత్తిడిని అధిగమించేక్రమంలో ఉపాద్యాయులంతా ఒక్కటై ప్రతిరోజూ విద్యార్థులకు తమ సొంత ఖర్చులతో అల్పాహారాన్ని అందిస్తూ ఆదర్శంగా నిలిచారు.
శనివారం ఎంఈవోలు అబ్దుల్ సత్తార్,శ్రీనివాసులు.ఈకార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు శారీరకశక్తిని, మానసికఉత్సాహాన్ని అందిస్తాయని, సేవ,సహకారాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
