యూఐ కేసుల పరిష్కారమే లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ.



 యూఐ కేసుల పరిష్కారమే లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ. 

ఈ-సాక్ష్య వినియోగంపై పోలీసులకు కొండేపి సిఐ దిశానిర్దేశం.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఎస్పీ. ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అధ్యక్షతన యూఐ కేసులు మరియు 'ఈ-సాక్ష్య' అప్లికేషన్ వినియోగంపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సీ.ఐ.మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా పరిష్కరించాలని మరియు దర్యాప్తులో నాణ్యతను పెంచాలని అధికారులను ఆదేశించారు. 

ముఖ్యంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా, నేరస్థలంలో సాక్ష్యాధారాలను 'ఈ-సాక్ష్య' యాప్ ద్వారా డిజిటల్ రూపంలో శాస్త్రీయంగా నమోదు చేయాలని సూచించారు. సాక్ష్యాల సేకరణలో పారదర్శకత పాటిస్తూ, న్యాయ ప్రక్రియలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 

ఈ సమావేశంలో కొండపి సర్కిల్ పరిధిలోని ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని దర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post