ఏపీడబ్ల్యూజేఎఫ్ మీడియా 2026 నూతన డైరీ ఆవిష్కరణ.



 ఏపీడబ్ల్యూజేఎఫ్ మీడియా 2026 నూతన డైరీ  ఆవిష్కరణ. 

జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో పనిచేయాలి. 

 ఆర్డిఓ ఎం అచ్యుత అంబరీష్ , డిఎస్పి శ్రావణ్ కుమార్.

 ఏలూరు జిల్లాలో జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చిన యూనియన్లకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆదుకోవడం యూనియన్ పాత్ర ఎంతో ప్రశంసనీయమని వారు అన్నారు. శుక్రవారం నాడు యూనియన్ 2026 నూతన డైరీ ని ఆర్డిఓ ఎం అచ్యుత అంబరీష్ ,ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ వారి కార్యాలయాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా పనిచేసే జర్నలిస్టులు అందరూ సామాజిక బాధ్యతతో ఉండాలని వారి వృత్తిని దుర్వినియోగం చేయకుండా మంచి నడవడికలో నడిచి సమాజానికి తమ వంతు సహకారం అందించాలని తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ సభ్యులు ఆపదలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషకరమని ఈ నేపథ్యంలో మా చేతుల మీదుగా యూనియన్ నూతన డైరీ ని ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జబీర్ , వై.వి.హరీష్, సోమశేఖర్,మిల్టన్, సత్యనారాయణ, శ్రీనివాస్, దాసు, జయరాం, వెంకట్రావు, సన్నీ తదితర యూనియన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post