మార్కాపురం లో జగదాంబ సమేత మార్కండేయ స్వామి రథోత్సవం లో పాల్గొన్న మంత్రి టీజీ భరత్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం:జిల్లా
మార్కాపురం పట్టణంలో శ్రీ జగదాంబ సమేత మార్కండేయ స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి జీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మంత్రి ముందుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి నివాసానికి వెళ్లి ముచ్చటించారు.అనంతరం సత్య జ్యువెలర్స ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి శాలలో వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జరిగిన రథోత్సవంలో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొనగా భక్తుల జయజయధ్వానాల మధ్య ఉత్సవం కన్నుల పండుగగా సాగింది.
ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
