పొదిలికి బైపాస్ లేనట్లే.


 పొదిలికి బైపాస్ లేనట్లే.

ఒంగొలు నుంచి పొదిలి రైల్వే బ్రిడ్జివరకు నాలుగులైన్లు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

రైల్వే బ్రిడ్జినుంచి బెస్తవారిపేట వరకు రెండు లైన్లు.

పొదిలి పట్టణంలోని ప్రధాన రహదారి సిమెంట్ రొడ్డుకై ప్రతిపాదనలు.

పి పి పి పద్దతిలో పనులు... ఒంగొలు నుంచి బెస్తవారిపేట లోపు మూడు టొల్ గేట్లు.

మార్కాపురంజిల్లా పొదిలిలో ప్రధానంగా ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చెప్పుకొదగ్గ ఊరటలభించలేదనేచెప్పుకొవచ్ఛు

ట్రాఫిక్ కష్టాలను తోలగించేందుకు అధికారులు మొదట బైపాస్ ప్లాన్ చేశారని భావించిన అది వ్యయప్రయాసాలు ఎక్కువకావడంతో దానిని విస్మరించినట్లు తెలుస్తుంది.

పొదిలి రొడ్లుభవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గొపాల క్రిష్ణా మీడియా తో మాట్లాడుతు పలు విషాయాలు వెల్లడించారు.

నేషనల్ హైవే ఆధ్వర్యంలో త్వరలో నూతన రహదారులు పిపిపి పద్దతిలో నిర్మించడానికి లైన్ క్లియర్ అయినట్లు ఆయన తెలిపారు.

పొదిలికి బైపాస్ కై ఎటువంటి ప్రతిపాదనలు లేవని ప్రస్తుతం ఉన్న 21 అడుగుల రొడ్డుకు ఇరువైపుల నాలుగు అడుగుల వెడల్పు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.

పొదిలి శివారు నుంచి బెస్తవారిపేట వరకు రెండు లైన్లు వేయనున్నరని తెలిపారు.

పట్టణం నుంచి అడ్డరొడ్డు వరకు సిమెంట్ రొడ్డు ప్రతిపాదనలు పెట్టినట్లు తెలిపారు.

త్వరలో ప్రభుత్వ ఆమోదం పొంది, నిధులు మంజురు అయిన వెంటనే నేషనల్ హైవే వారి ఆధ్వర్యంలో పిపిపి పద్దతిలో నిర్మించనున్నట్లు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post