ఒంగోలు ఆర్టిసి బస్టాండ్ ను అకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్.



ఒంగోలు ఆర్టిసి బస్టాండ్ ను అకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా  ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. శనివారం బస్టాండును ఆయన పరిశీలించారు. ప్రాంగణం మొత్తం కలియతిరిగి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. 

ఈ బస్టాండుకు ఉన్న రద్దీ, టాయిలెట్ల ఏర్పాటు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు పార్కింగ్ సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ఆ స్థాయికి తగినట్లుగా అవసరమైన టాయిలెట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. 

దీనితోపాటు పార్కింగ్, పారిశుద్ధ్యంపై మరింత దృష్టి సారించాలన్నారు. 

ఈ దిశగా వారం రోజుల్లోగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

నెల రోజుల్లోగా గణనీయమైన మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆర్టీసీ ఆర్.ఎం. సత్యనారాయణ, డీ.ఎం. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సూపర్వైజర్ ఫణి కుమార్, ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, తహసిల్దార్ మధుసూదన్, ఇతర అధికారులు ఉన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post