ప్రమాదవశాత్తు నదిలో పడిన బాబు ఆచూకి కోసం గాలింపు.
అనకాపల్లి ఫిబ్రవరి:09.
చోడవరం సీఐ అప్పలరాజు ఇచ్చిన సమాచారం బూరప సత్యవతి భర్త అప్పలనాయుడు మునగపాక మండలం, నరేంద్రపురం గ్రామం, ఆమె కూతురు లీలాకి బంటు శివ తో వివాహం 2025 మర్చి లో అయినట్లు వారికి ఒక బాబు తేదీ.28.12.2025 న జన్మించినట్లు, ప్రసవం తరువాత లీల తీవ్రమైన ఆందోళనకి లోనై, ఒకరోజు లీల తన బిడ్డను ఇంటి వద్ద వదిలి ఊరిలో గల పెద్దకొండకు వెళ్లినట్లు, లీలను వెతికి తీసుకు వచ్చిన తరువాత లీల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చోడవరం కోట వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు, లీలతో పాటు ఆమె భర్త,తల్లి, అత్త ఉంటున్నట్లు,తేదీ 07.02.2026 న లీల భర్త అయిన శివ తన సొంత గ్రామానికి వెళ్లగా అదే రోజు రాత్రి సుమారు 11.20 నుండి 12.00 గంటల సమయం లో లీల కి మరల ఆందోళన రావడంతో తన 42 రోజుల బిడ్డను తీసుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. తెలిసిన వెంటనే ఈ విషయం శివ కి చెప్పగా అతను వెతికి 08.02.2026 నా ఉదయం 6.08 గంటల సమయంలో 100 కు ఫోన్ చేయడం, అలాగే 07.00 గంటలకు శివకి లీల ఫోన్ చేసి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నానని చెప్పినట్లు, శివ అక్కడకి వెల్లి బాబు గురించి అడగగా బ్రిడ్జి దగ్గర బాబు తన చేతుల నుండి జారి నీటిలో పడిపోయాడని ఎంత వెతికిన బిడ్డ కనిపించలేదని చెప్పినట్లు రిపోర్ట్ ఇవ్వగ, దీనిపై చోడవరం సీఐ పి.అప్పలరాజు ఆదేశాల మేరకు ఎస్ఐ బి. జోగారావు బాలుడు అదృశ్య కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
