దివ్యాంగుల అభివృద్ధి సంక్షే మానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది- మంత్రి డా,స్వామి.



 దివ్యాంగుల అభివృద్ధి సంక్షే మానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది- మంత్రి డా,స్వామి.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లాలో 2021-22 & 2022-23 సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్ లాగ్ class-iv ఉద్యోగాలు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం,మంత్రి స్వామి చొరవతో పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్ లాగ్ class-iv ఉద్యోగాలు భర్తీ.ఉద్యోగాలుపొందిననలుగురుకి తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేసిన మంత్రి డిఎస్ బీవీ స్వామి,సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులురాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటార్ బైక్ లు పంపిణీ త్వరలో చేయనున్నామని తెలిపారు,దివ్యాంగులకు వీల్ చైర్లు, సహాయ పరికరాలు, విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు కార్యక్రమం తీసుకొచ్చారు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం,దివ్యాంగుల సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ లలో వీల్ చైర్లు ఏర్పాటు చేస్తాము.

ప్రకాశం జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తామన్నారు.దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post