ఆటోల్లో అధిక శబ్ద కాలుష్యం, నిషిద్ధ ఎల్ఈడి లైట్ల పై ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర రావు అవగాహనా చర్యలు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, ఏలూరు త్రీ టౌన్ పోలీసులు పట్టణంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఆటోలలో అమర్చిన భారీ సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు మరియు కంటికి విఘాతం కలిగించే నిషిద్ధ ఎల్ఈడి బల్బుల పై ఈ చర్యలు చేపట్టారు.
ఏలూరు త్రీ టౌన్ ఇన్స్‌పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్సైలు రాంబాబు, అప్పారావు మరియు వారి సిబ్బంది పట్టణం లోని ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సుమారు 40 కి పైగా ఆటోలను తనిఖీ చేశారు. వాటిలో అమర్చిన సౌండ్ సిస్టమ్స్ మరియు ఎల్ఈడి లైట్లను అక్కడికక్కడే తొలగించారు.
అనర్థాల పై అవగాహన - ఇన్స్‌పెక్టర్ కోటే శ్వరరావు .
ఈ సందర్భంగా ఇన్స్‌పెక్టర్ గారు ఆటో డ్రైవర్లకు వీటివల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.
ఆటోల్లో పెద్ద శబ్దంతో పాటలు పెట్టడం వల్ల రోడ్డుపై వెళ్లే ఇతర వాహన దారుల ఏకాగ్రత దెబ్బతింటుంది.
ముఖ్యంగా వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు మరియు చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు.
నిషిద్ధ ఎల్ఈడి లైట్లు ఆటోల ముందు, వెనుక అమర్చే రంగురంగుల ఎల్ఈడి లైట్ల తీవ్రత వల్ల ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లు మిరుమిట్లు గొలిపి, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
చట్ట పరమైన చర్యలు వాహన తయారీ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి మార్పులు చేయడం మోటార్ వాహన చట్టం ప్రకారం నేరమని, మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్రజల రక్షణ మరియు ప్రశాంత తే మా ప్రాధాన్యత. ఆటో డ్రైవర్లు కేవలం జీవనోపాధి కోసం మాత్రమే వాహనాలను నడపాలి తప్ప, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా విన్యాసాలు చేయకూడదు అని పోలీసులు స్పష్టం చేశారు.
ఈ డ్రైవ్ ను స్థానిక ప్రజలు మరియు ప్రయాణికులు హర్షించారు.
