రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు:, జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పుర్తిచేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఎఈఆర్ఓలను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్ నందు జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, తన చాంబర్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో, జిల్లా లోని అన్నీ నియోజకవర్గాల ఎఈఆర్ఓలతో సమావేశమై జిల్లా లో జరుగుచున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ పరిష్కారం పై సమీక్షించి దిశానిర్దేశం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు 75.44 శాతం పూర్తీ చేయడం జరిగిందన్నారు.
జిల్లా లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పటిష్టంగా చేపట్టడంపై జిల్లాకు 5 అవార్డులు కూడా రావడం జరిగిందని గుర్తు చేస్తూ, అదే స్పూర్తితో మిగిలిన మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తీ చేసేలా ఎఈఆర్ఓలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.
మ్యాపింగ్ ప్రక్రియలో అశ్రద్ద చూపిన బిఎల్ఓలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, మ్యాపింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించిన బిఎల్ఓ లపై చర్యలుతీసుకోవడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి స్పష్టం చేసారు.
ఈ నెల 28వ తేదీ, మార్చి 1వ తేదీ మరియు మార్చి 7, 8 తేదీల్లో 4 రోజులు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందని, ఈ ప్రత్యేక ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ క్యాంపెయిన్ కు రాజకీయ పార్టీల వారు కూడా తమ వంతు సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి, రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
జిల్లాలోని అన్నీ నియోజక వర్గాల్లో ఇప్పటివరకు మొత్తం 3,613 క్లెయిమ్స్ పెండింగ్ లో వున్నాయని, వీటిని సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, జిల్లా లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకునేలా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యు అధికారి, ఎఈఆర్ఓలను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్డిసి లు శ్రీమతి మాధురి, జాన్సన్, ఎలక్షన్ సెల్ సూపరంటెండ్ శ్రీనివాసరావు, వైసీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, టీడీపీ ప్రతినిధి.కొటారి నాగేశ్వర రావు, బీజేపీ ప్రతినిధి. గుర్రం సత్యనారాయణ, అన్నీ నియోజక వర్గాల ఎన్నికల డిటిలు తదితరులు పాల్గొన్నారు.

