రవాణా శాఖ అధికారుల తో సమీక్షా సమావేశం. కలెక్టర్.


 రవాణా శాఖ అధికారుల తో సమీక్షా సమావేశం. కలెక్టర్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఒంగోలు.

      ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సంబంధిత శాఖ అధికారులతో ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వాహనాల ఫిట్నెస్, ఏ.టి.ఎస్, ఆర్.సి. లైసెన్స్ల జారీలో జాప్యం పై ఐ.వీ.ఆర్.ఎస్.లో వ్యక్తం అవుతున్న ప్రజల అభిప్రాయాలను ఈ సమావేశంలో చర్చించారు. డిటిసి సుశీల మాట్లాడుతూ సాంకేతిక సమస్యల వలన వివిధ పత్రాల జారీలో జాప్యం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో వస్తున్న గ్రీవెన్స్ అర్జీల విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో రవాణాశాఖ పై ప్రజల్లో సానుకూల దృక్పథం ఏర్పడేలా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రవర్తన కూడా ముఖ్యమన్నారు. ఈ సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post