కే.జె పురంలో ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామరావుకి వర్ధంతి వేడుకలు.
అనకాపల్లి జనవరి:18
ప్రకాశం విశ్వవిఖ్యాత,నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురం గ్రామంలో ఆదివారం ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు టీడీపీ మాజీ సర్పంచ్ కుమారుడు ఆళ్ల శివకుమార్. టీడీపీ సీనియర్ నాయకులు పాలకుర్తి శ్రీనివాస్రావు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేది మూడక్షరాల పేరు కాదు అది తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక.తెలుగు జాతి శక్తిని దశ దిశలా చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్. సంక్షేమానికి ఆద్యుడు అన్న ఎన్టీఆర్. విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి పధకాలు తీసుకొచ్చి పేదల గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్.
పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్ పాలనలో తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్న ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారు. తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిలా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది.ఎన్టీఆర్ ఆశయాలగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాలన సాగిస్తున్నారని ఆళ్ల శివకుమార్ ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాలకుర్తి శ్రీనివాసరావు. ఆళ్ల సంతోష్. సరగడం అధిబాబు.ఆడారి బాబ్జి కర్రి నాగమణి. మద్దాల ప్రసాద్. రాపెటి జోగినాయుడు. ఆడారి జగదీశ్ మరియు టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
