క్షేత్రస్థాయిలో చర్యలను ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా సరఫరాపై దృష్టి సారించాలని కలెక్టర్. స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
వ్యవసాయ - దాని అనుబంధ రంగాలు, పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంపై మండల స్థాయి అధికారులతో మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు సేవా కేంద్రాలు, సొసైటీలు, ప్రైవేటు విక్రయదారుల ద్వారా పూర్తిస్థాయిలో రైతులకు అవసరమైన మేరకు యూరియా, ఇతర ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. ఇవి రైతులకు చేరటంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించాలని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు దిశా నిర్దేశం చేశారు.
దగ్గరుండి రైతులకు అందించాలని, సంబంధించిన ఫోటోలను తనకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.
అధిక ధరలకు ఎవరైనా విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
రబీ సీజన్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సరఫరాను పర్యవేక్షించాలని అధికారులకు చెప్పారు.
మార్కాపురం జిల్లా పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా మార్చాలని ప్రభుత్వం దృష్టి సారించినందున క్షేత్రస్థాయిలో ఈ దిశగా చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఆయా ప్రాంతాలకు తగిన ఉద్యాన పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వం నుంచి వారికి సాంకేతిక సహకారం సకాలంలో అందేలా చూడాలన్నారు.
సూక్ష్మ సేద్యం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా వివరించాలన్నారు. పశుసంవర్ధక, మత్స్య శాఖల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి ( గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ - జీవీఏ) సాధించేలా మరింత దృష్టి సారించాలని చెప్పారు. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో కుదిరిన ఒప్పందాల మేరకు త్వరగా పరిశ్రమలు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పీఎం ఈజిపి పథకంలోనూ ఉపాధి కల్పించేలా పరిశ్రమ శాఖతో డిఆర్డిఏ, మెప్మా సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ప్రవర్తన ఎంతో కీలకమని, పెన్షన్ దారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పెన్షన్ ఇచ్చినందుకు లంచం తీసుకున్నట్లు తెలిస్తే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని, సకాలంలో ఇంటి పన్ను వసూలుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, సిపిఓ సుధాకర్ రెడ్డి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు వరలక్ష్మి, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు, ప్రకృతి సేద్యం డిపిఎం సుభాషిణి, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గోపీచంద్, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వరరావు, డిఆర్డిఏ పిడి నారాయణ, మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ మదన్, ఎల్ డి ఎం రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
త్వరగా రీ సర్వే, మ్యూటేషన్లు
రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మ్యూటేషన్లు కూడా సకాలంలో చేసేలా చర్యలు తీసుకోవాలని సి సి ఎల్ ఏ జయలక్ష్మి చెప్పారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ అంశాలతో పాటు ' మీకోసం' అర్జీలను పరిష్కరిస్తున్న తీరు, ' రెవెన్యూ క్లినిక్ 'లు సమర్థవంతంగా నిర్వహించడంపై ఆమె సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ.ఆర్. గోపాలకృష్ణ, డిఆర్ఓ బి. చిన ఓబులేసు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
