పాఠశాలకు భోజనం ప్లేట్లు, గ్లాసులు వితరణ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సమయంలో ప్లేట్లు,గ్లాసుల కొరతతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నెమిలిదిన్నె. చెన్నారెడ్డి పాఠశాల విద్యార్థులకు 100 భోజనం ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు.సదరు బోజన ప్లేట్లు గ్లాసులను ఎన్ సి ఆర్ టీమ్ చేతులమీదుగా బుధవారం విద్యార్థులకు బహుకరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు అవసరమైన వస్తు,సేవలను అందించడం అభినందనీయమని,దాతలు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారని అన్నారు. కార్యక్రమంలో కంభం ఎం.పి.టి.సి ఆనంద్,మండల వైసీపి మండల యూత్ అధ్యక్షులు గురుమూర్తి, వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు షాహిద్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
