సుందరయ్య కాలనీ ప్రజానీకానికి త్రాగేందుకు గోదావరి జలాలు సరఫరా చేయాలి--కాలనీ అభివృద్ధి కమిటీ విన్నపము.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు నగరం, 19 డివిజన్, సుందరయ్య కాలనీ ప్రజానీకానికి గోదావరి జలాలు త్రాగునీరుగా ఇవ్వాలని, మిగిలిపోయిన రోడ్లు, పైపులైను నిర్మాణం పూర్తి చేయాలని, ఇండ్లపై నుండి వెళ్తున్న కరెంటు లైన్ ను మార్పించాలని కోరుతూ నేడు సుందరయ్య కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్ గారికి సుందరయ్య కాలనీ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాను ఉద్దేశించి సుందరయ్య కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు బి. సోమయ్య మాట్లాడుతూ సుందరయ్య కాలనీ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు పూర్తవుతుందని, కానీ ప్రజానీకానికి సరైన తాగనీటి వసతి లేక కాలనీ ప్రజానీకం అంతా మంచినీరు కొనుక్కొని తాగాల్సిన దుస్తుతి ఉందని అన్నారు. కాలనీలో 200 కుటుంబాలకు పైగా కాపురాలు ఉంటున్నాయని వారికి సరఫరా చేసే సుద్ధ నీరు వల్ల ప్రజల ఆరోగ్యాలు, ఇళ్లల్లో సామాన్లు, వంట పాత్రలు, పైపులైన్లు అన్ని పాడైపోతున్నాయని తెలిపారు. సుందరయ్య కాలనీ ప్రజానీకానికి గోదావరి జలాలు సరఫరా చేయాలని ఆయన మున్సిపల్ అధికారులను, పాలకవర్గాన్ని కోరారు. గత ఎన్నికలకు ముందు 6 మాసాల్లో గోదావరి జలాలు ఇస్తామని పాలకూలు వాగ్దానం చేశారని, 5 సంవత్సరాలు పూర్తవుతున్న నేటికీ ఆ వాగ్దానం అమలు కాలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, పాలకవర్గం తక్షణమే స్పందించి సుందరయ్య కాలనీ ప్రజానీకానికి గోదావరి జలాలు తాగునీరుగా ఇవ్వాలని ఆయన కోరారు.సుద్ధ నీరు తాగునీరుగా ఇవ్వడం వల్ల ప్రజలు సుద్ధ నీరు తాగలేక పోతున్నారన్నారు. ప్రతి ఇంటికి రోజుకి వాటర్ టిన్నుకు పది రూపాయలు చొప్పున గత పది సంవత్సరాలుగా దాదాపు కోటి రూపాయలు పైగా మంచి నీటి కోసం ఖర్చు చేశారని తెలిపారు. ప్రజల తాగునీటి కష్టాలు తీరాలంటే గోదావరి జలాల సరఫరా మాత్రమే సరైన పరిష్కారం అని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కాలనీ అధ్యక్షులు వెంపటాపు శంకర్రావు, కార్యదర్శి పిల్లి రాజులు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమానికి రెడ్డి రాఘవమ్మ, మొగ్గ గౌరమ్మ,వెలివెల రత్నం,ఎం.రమణమ్మ,కె.విజయలక్ష్మి, వెలవెల వెంకన్న, కోదాటి రాజేష్, ఎన్. ప్రశాంత్,పి.అప్పలనాయుడు, కస్పా రాము, తీట్ల వెంకటేశ్వరరావు, చల్లా వెంకన్న, కే.కనకరాజు, జి.అప్పల్నాయుడు తదితరులు నాయకత్వం వహించారు.

