మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు గారి 76 వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి అప్పలనాయుడు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.ఏలూరు/జంగారెడ్డిగూడెం. ఏజెన్సీ టైగర్, మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు గారి 76 వ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం లోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ మేకా ఈశ్వరయ్య , పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
