ప్రజా సమస్యల కోసం మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి - జిల్లా కలెక్టర్ పి. రాజబాబు.


 ప్రజా సమస్యల కోసం మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి - జిల్లా కలెక్టర్ పి. రాజబాబు.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఒంగోలు, డిసెంబర్ 13 

      ప్రజా పిర్యాదుల మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post