మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎస్పీ తుహిన్ సిన్హా.
2003 బ్యాచ్ మెట్స్ నుండి మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1,50,000/- ఆర్థిక సహాయం అందజేసిన ఎస్పీ తుహిన్ సిన్హా.క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ 25: అనకాపల్లి జిల్లా కృష్ణ దేవిపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ కిల్లో దీనబంధు కిడ్నీ సంబంధిత వ్యాధితో గత నెలలో మరణించారు. వారి కుటుంబాన్ని ఆదుకునే లక్ష్యంతో అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల 2003 బ్యాచ్ మెట్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.1,50,000/- ఆర్థిక సహాయం అందించారు.ఈ మేరకు, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ చేతుల మీదుగా, దివంగత హెడ్ కానిస్టేబుల్ భార్య కిల్లో రాధ మరియు కుమారుడు నిఖిలేష్ విజయ్ (8 సంవత్సరాలు) కు సహాయం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 2003 బ్యాచ్ మెట్స్ నాగరాజు, మహేష్, కాంతి కిరణ్, సత్యనారాయణ, రమణ, వరాహ బాబు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ—
“విధి నిర్వహణలో పనిచేసిన సహచరుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన 2003 బ్యాచ్ మేట్స్ అందరికీ అభినందనలు. ఇటువంటి సేవాభావం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శం. కష్టకాలంలో ఒకరి కోసం అందరూ అండగా నిలవాలి” అని పేర్కొన్నారు.
