పోక్సో, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు - ఎస్ ఐ. బాషా.


  పోక్సో, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు - ఎస్ ఐ. బాషా.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.

* ఏలూరు జిల్లా ఎస్పీ  కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ  డి. శ్రావణ్ కుమార్ ఆదేశాలతో భీమడోలు ఇన్‌స్పెక్టర్  యు. జె. విల్సన్  ఆధ్వర్యంలో భీమడోలు హైస్కూల్‌లో విద్యార్థినీ, విద్యార్థులకు పోక్సో  చట్టాలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు మరియు సోషల్ మీడియా భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

* ఈ కార్యక్రమంలో భీమడోలు ఎస్‌ఐ ఎస్ కే. మదీనా బాషా  మరియు వారి సిబ్బంది పాల్గొని విద్యార్థులకు కీలక విషయాలను వివరించారు.

* పోక్సో చట్టం ప్రాముఖ్యత బాల బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు జరిగినప్పుడు చట్టం వారికి ఎలా రక్షణ కల్పిస్తుంది, తక్షణ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి అనే విషయాలను గురించి వివరించారు.

*  సోషల్ మీడియా (ముఖ్యంగా అపరిచిత వ్యక్తులు) నుండి వచ్చే వేధింపులు, ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచారం ఇతరులకు ఇవ్వడం వలన కలిగే నష్టాలపై విద్యార్థులను అప్రమత్తం చేశారు.

 * బాల్య వివాహాల వలన విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఎలా నాశనమవు తుందో, చట్ట ప్రకారం అవి నేరం అవుతాయో వివరించారు. అలాంటి సందర్భాలలో వెంటనే పోలీసులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్‌ నెంబర్ 1098 సమాచారం ఇవ్వాలని సూచించారు.

* విద్యార్థులు సోషల్ మీడియాను సమాచార సేకరణకు, జ్ఞానార్జనకు మాత్రమే ఉపయోగించాలని, వ్యక్తిగత ఫోటోలు లేదా వివరాలను పోస్ట్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.

* విద్యార్థుల్లో చట్టాలపై మరియు తమ భద్రతపై అవగాహన పెంచడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది అని భీమడోలు ఎస్ఐ ఎస్ కే మదీనా బాషా గారు తెలియచేసారు.

ఈ అవగాహన సదస్సులో భీమడోలు ఎస్‌ఐ ఎస్ కే. మదీనా బాషా తో పాటు పోలీస్ సిబ్బంది, జి ఎం ఎస్ కే(గ్రామ వార్డుల/సిబ్బంది సమన్వయకర్తలు) మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post