క్రొత్త స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ త్వరగా పూర్తి చెయ్యాలి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశంజిల్లా కంభం మండల తహశీల్దారు కార్యాలయంలో డీలర్ల సమావేశం జరిగినది. ఈ సందర్భంగా తాసిల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్రొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ త్వరగా పూర్తి చేయాలని ప్రతి నెల 01వ తారీకు నుండి 15వ తేదీ వరకు నిత్యావసర సరుకులు ప్రతి పూర్తి చేయాలని, 25 నుండి 30వ తేదీ లోపు వికలాంగులకు ఇంటి వద్దనే బియ్యం పంపిణీ చేయాలని, ఎవరైనా ఉచిత బియ్యాన్ని కార్డు లబ్ధిదారుడికి ఇవ్వలేదని తెలిసిన వారి పైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు త్వరగా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు ఈ సమావేశంలో మండలంలో వివిధ గ్రామాల డీలర్లు హాజరయ్యారు,
