ఏలూరు పేరయ్య కోనేరు రామకోటి ప్రాంగణంలో నిర్విరామంగా కొనసాగుతున్న భిక్షా కార్యక్రమం.
36 వ రోజు భిక్షప్రదాతులు కొట్టు సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులు, కూనపరెడ్డి మురళి కృష్ణ గారి కుటుంబ సభ్యులు.
ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, మాజీ ఈడ చైర్మన్ ఎంఆర్డి బలరాం.
అనంతరం ఘనంగా కొట్టు మనోజ్ స్వామి పుట్టినరోజు వేడుకలు.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.
ఏలూరు, నవంబర్ 18:- ఏలూరులోని స్థానిక పేరయ్య కోనేరు రామకోటి మైదానం ప్రాంగణం నందు సర్వమాలధారణ స్వాములకు నిర్విరామంగా కమిటీ వారి ఆధ్వర్యంలో భిక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సుమారు 55 రోజుల పాటు ఈ భిక్ష కార్యక్రమం కొనసాగుతుందని అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం కమిటీ సభ్యులు తెలిపారు. దానిలో భాగంగా 36 వ రోజు భిక్షప్రదాతలుగా దివ్య శ్రీ కొట్టు సత్యనారాయణ నాగేశ్వరమ్మ గార్ల మనువడు కొట్టు మధు వెంకటరావు, నాగకుమారి దంపతుల కుమారుడు కొట్టు మనోజ్ సత్య సాయినాథ్ లక్ష్మీ హాస దంపతులు మరియు కూనపరెడ్డి మురళి కృష్ణ, నాగ భాగ్యలక్ష్మి రమామణి దంపతులు వ్యవహరించారు. తొలుత అయ్యప్ప స్వామి వారికి కొట్టు మనోజ్, లక్ష్మీ హాస దంపతులచే శాస్త్రోక్తంగా అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు గారు, మాజీ ఈడ చైర్మన్ ఎంఆర్డి బలరాం గారు పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. అయ్యప్ప స్వామి వారికి పూజలు, మహా నైవేద్యం, హారతులు ఇచ్చిన అనంతరం భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన ప్రభువులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు పేరయ్య కోనేరులోని రామకోటి మైదానం ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం కమిటీ వారి ఆధ్వర్యంలో సర్వమాల ధారణ స్వాములకు 55 రోజులపాటు భిక్షా కార్యక్రమం నిర్విరామంగా నిర్వహిస్తున్నారని, గత నాలుగు సంవత్సరాలుగా శ్రీ కొట్టు కొట్టు మధు, కొట్టు మనోజ్ గారి బృందం మరియు అన్నపూర్ణ సహిత హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం కమిటీ వారి ఆధ్వర్యంలో స్వాములకు ఉదయం వడై, మధ్యాహ్నం భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. గత నాలుగు సంవత్సరాలుగా అనేకమంది నిత్యం వెయ్యి మందికి పైగా స్వాములు ఈ భిక్ష కార్యక్రమాన్ని ఆరగిస్తున్నారని, దీక్ష ధారణ స్వాములకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, అన్ని అన్ని సౌకర్యాలతో పాటు అందజేయడం జరుగుతుందన్నారు. అయ్యప్ప భక్తులకు గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తున్న అన్నపూర్ణ సహిత హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం కమిటీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు. ఆ అయ్యప్ప స్వామి పట్ల వీళ్ళు చూపించే భక్తి భావనతో అయ్యప్ప స్వామి వారి కృప చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇది చాలా గొప్ప కార్యక్రమం అని, ఏలూరు నగరానికి ఇది ఒక శుభకరంగా భావిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని దీక్ష ధారణ చేపట్టిన సర్వమాలధారణ స్వాములందరూ భక్తి భావనతో క్రమశిక్షణతో ఉండాలని ఆయన కోరారు. అనంతరం కొట్టు మనోజ్ స్వామి పుట్టినరోజు సందర్భంగా పుష్ప గుఛ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి సుబ్బారావు, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి మారం జయసూర్య, ప్రధాన కోశాధికారి కొట్టు మనోజ్, జగపతి మనోహరం గురుస్వామి, ఆదివారపు పేట సాయిబాబా ఆలయ చైర్మన్ ఇసుకపల్లి తాతారావు, ఇతర కార్యవర్గ సభ్యులు, జనసేన నాయకులు లక్కింశెట్టి కిరణ్ కుమార్, మేక సాయి, అధిక సంఖ్యలో సర్వమాల ధారణ స్వాములు భక్తులు పాల్గొన్నారు. ప్రాంగణం అంతా అయ్యప్ప నామస్మరణతో శరణు ఘోషలతో మారుమ్రోగింది.



