మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. మార్కాపురం జిల్లా సాధన సమితి డిమాండ్.


 మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. మార్కాపురం జిల్లా సాధన సమితి డిమాండ్.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని. మార్కాపురం జిల్లా సాధన సమితి కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా పట్టణ కేంద్రంగా మార్కాపురంలోని గిద్దలూరు ఎర్రగొండపాలెం దర్శి కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గాల తో కలుపుకొని. కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని గతంలో ఈ ప్రాంతంలోని మరియు పలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో డిమాండ్ చేసిన విషయం మనకందరికీ తెలుసు. అయితే ప్రస్తుత అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ ఎన్నికల మ్యానుఫ్యాక్టోలో. పొందుపరచడమే కాకుండా ఎన్నికల్లో వాగ్దానం కూడా చేశారన్నారు. 

ఇటీవల కాలంలో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి దాన్ని ఆధ్వర్యంలో. సక్రమంగా వేగవంతం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో. మన ప్రాంత ప్రజలు ఆత్మగౌరం డిమాండ్ ను పరిధిలోనికి తీసుకొని ప్రభుత్వం మార్కాపురం జిల్లాను వెంటనే ప్రకటించాలని మార్కాపురం జిల్లా సాధన సమితి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఈనెల 27వ తేదీన గురువారం రామాలయం శివాలయం సాయిబాబా దేవాలయం కూడలినుండి కందులాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెంటర్ మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక తాసిల్దార్ కి మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వినతి పత్రము అందజేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు మీనిగా. ప్రసాద్. అధ్యక్షులు దేవి రెడ్డి నాగేంద్రుడు. ఉపాధ్యక్షులు నారు. ఆదినారాయణ రెడ్డి. న్యాయ సలహాదారులు. రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వేష పోగు బాలు. రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ఎం. మురళి.ఆరవీటి చిరంజీవి గుప్తా. తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post