గంజాయి కేసులో ముద్దాయికి 10 ఏళ్ల కారాగార శిక్ష, లక్ష జరీమాన.తీర్పు వెలువరించిన చోడవరం కోర్టు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి జిల్లా రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి నవంబర్:01చోడవరం::
గంజాయి విక్రయం కేసులో ఒక ముద్దాయికి పదేళ్లు కారగార శిక్ష, లక్ష రూపాయలు జరిమాను విధిస్తూ చోడవరం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఒకవేళ జరిమన చెల్లించని ఎడల మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలనీ తీర్పులో పేర్కొన్నారు. అల్లూరు జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల కొనుగోలు, విక్రయం పై సెప్టెంబర్ 21 2021లో కేసు నమోదయింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై ఎన్టిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ముద్దాయి రాజు, (37) పంజాబీ హిందూ, అటూటా గ్రామం, బాబుగఢ్ పోలీస్ స్టేషను, గాజియాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. సెప్టెంబర్ 21, 2021న, అనంతగిరి పోలీస్ స్టేషను పరిధిలో, మత్తుపదార్థాలైన 620 కిలోగ్రాముల గంజాయితో పట్టుబడిన సంఘటనకు సంబంధించి ఈ కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయగా ఏ 2 రాజు ఆ రోజునే అరెస్టు చేయబడ్డాడు. తదనంతరం విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. మరొక ముద్దాయి ఏ 1, ఈ తీర్పు సమయానికి కూడా పోలీసులకు దొరకని స్థితిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 9వ అదనపు సెషన్స్ జిడ్జి కోర్ట్ శుక్రవారం ఏ 2 ముద్దాయి రాజుపై తీర్చు విలువరించినట్టు చోడవరం సీఐ అప్పలరాజు తెలిపారు.
