చర్మ రోగ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలి అధికారులకు ఆదేశం కలెక్టర్.


 చర్మ రోగ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలి అధికారులకు ఆదేశం కలెక్టర్. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు ఈనెల 17వ తేదీ నుంచి చేపట్టే చర్మరోగ పరీక్షల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని ప్రకాశం కలెక్టర్ కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏ రోగమైనా ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు, వైద్యం తీసుకోవడం ద్వారా నివారణ సులువు అవుతుందన్నారు. ఈ దిశగా వైద్య, జిల్లా పరిషత్, పంచాయతీ, విద్య శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని చెప్పారు. 

దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నెలాఖరు వరకు జరిగే చర్మరోగ పరీక్షల కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 

దీనికి సంబంధించిన పోస్టరును ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ నివారణ అధికారి బాలాజీ, జిల్లా ఉప వైద్య అధికారి.చంద్రమౌళీశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post