ఆదర్శంగా నిలుస్తున్న లంకవానిపాలెం గ్రామం.


 ఆదర్శంగా నిలుస్తున్న లంకవానిపాలెం గ్రామం.

లంకవానిపాలెం యువత – పచ్చగా, స్వచ్ఛంగా గ్రామ పరిసరాలు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. 

జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ (క్రైమ్).

అనకాపల్లి జిల్లా, కె. కోటపాడు మండలం:

లంకవాని పాలెం గ్రామ యువకులు ఇటీవల చేపట్టిన “పచ్చదనం – పరిశుభ్రత” కార్యక్రమం గ్రామస్థులను, స్థానిక సర్పంచ్‌లను, ప్రజాప్రతినిధులను గర్వింపజేసింది. గ్రామ పరిసరాల్లో చెత్త, కలుపు మొక్కలను తొలగించి గ్రామాన్ని పచ్చగా, శుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమం వర్రి షణ్ముఖ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఆయన మార్గదర్శకత్వంలో గ్రామ యువకులు కలిసికట్టుగా శ్రమదానం చేశారు. ఎప్పటినుండో చెత్తతో నిండిపోయిన గ్రామ స్మశానంలో తుప్పలను తొలగించి, ఆ ప్రదేశాన్ని పునరుద్ధరించడం ఈ ఆదివారం జరిగింది.గత ఆదివారం గృహలింగేశ్వర స్వామి గుడి పరిసరాల్లో కూడా యువత క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. ఈ ఆదివారం స్మశానం వద్ద నిర్వహించిన కార్యక్రమం ద్వారా వారు గ్రామానికి ఆదర్శంగా నిలిచారు.

 గ్రామ ప్రజలు మాట్లాడుతూ –

యువత ఈ విధంగా ముందుకు రావడం గ్రామానికి గర్వకారణం. ఇలాంటి సేవా కార్యక్రమాలు తరచుగా కొనసాగాలన ఆశిస్తున్నాం,” అని తెలిపారు.

 గ్రామ సర్పంచ్‌లు, స్థానిక పెద్దలు మాట్లాడుతూ..

లంకవాణిపాలెం యువత స్వచ్ఛత, పచ్చదనం పరిరక్షణలో నిజమైన ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇతర గ్రామాలకూ మార్గదర్శకంగా నిలవాలి” అని అభినందనలు తెలిపారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలు కె. కోటపాడు మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా పర్యావరణంపై అవగాహన పెంచడానికి దోహదపడతాయని స్థానికులు భావిస్తున్నారు. యువత కృషి వల్ల గ్రామ పరిసరాల పర్యావరణం మెరుగుపడటమే కాకుండా, సమాజ సేవా భావం, నాయకత్వం అనే విలువలు మరింత బలపడుతున్నాయి.లంకవాని పాలెం యువత పచ్చదనం, స్వచ్ఛత, సమాజ సేవలో ఆదర్శంగా నిలుస్తూ, కె. కోటపాడు మండలానికి గర్వకారణంగా మారారు.

 

Post a Comment

Previous Post Next Post