మెడికల్ కాలేజీ ప్రవేట్కర్ణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు స్వీకరిస్తున్న వైస్సార్సీపీ నాయకులు.

మెడికల్ కాలేజీ ప్రవేట్కర్ణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు స్వీకరిస్తున్న వైస్సార్సీపీ నాయకులు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.

అనకాపల్లి అక్టోబర్:22.మాడుగుల నియోజకవర్గం.

దేవరాపల్లి మండలం,మామిడిపల్లి గ్రామంలో బుధవారం దేవరాపల్లి మండల జడ్పీటీసీ కర్రి సత్యం ,దేవరాపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు పంచాడ సింహాచలం నాయుడు,గ్రామ సర్పంచ్ మరియు దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు కర్రి సూరినాయుడు ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు రాష్టంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్యాయంగా 17మెడికల్ కాలేజీలును ప్రైవేట్పరం చేసే కార్యక్రమంను అడ్డుకొనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత్రుత్వంవంలో ప్రజలుకు విషయం తెలియజేసి కోటి సంతకాలు సేకరణ కోరకు ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి,రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు బూడి ముత్యాల నాయుడు ఉత్తరాంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లే అనురాధ విచ్చేసి ప్రజలు అందరితో రచ్చబండ సమావేశమై ప్రజలుకు కూటమి ప్రభుత్వ పరిపాలన వలన జరుగుతున్న ఇబ్బందులు, అన్యాయాలును వివరిస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలును ప్రైవేట్ పరం కాకుండా ప్రజలు మద్దత్తుతో అడ్డుకొనుటకు వారి సంతకాలు సేకరించి రాష్ట్ర గవర్నర్కి సమర్పించుటకు సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షులు చింతల బుల్లి లక్ష్మి ,దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు, వేచలం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి శఠారి నాయుడు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లా మహేష్ జూరెడ్డి గోవింద. వేచలపు చిన్నంనాయుడు,కార్యకర్తలు,విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post